Header Banner

ప్రయాణికులకు భారీ శుభవార్త! కేవలం రూ.99కే హైదరాబాద్‌-విజయవాడ బస్ జర్నీ!

  Fri Feb 07, 2025 08:50        Travel

ఈ రోజుల్లో ప్రయాణాలు చెయ్యాలంటే.. ప్రజలు జేబులు తడుముకోవాల్సి వస్తోంది. టికెట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలంటే.. నార్మల్ బస్ టికెట్ కూడా రూ.600 దాకా ఉంటోంది. ఇక ఏసీ అయితే.. రూ.1,500 అవుతుంది. ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు ఎలా ఛార్జీలు బాదేస్తారో అందరికీ తెలుసు. ఐతే.. ఇక ఈ భారీ ఛార్జీల భారం దిగబోతోంది. హైదరాబాద్, విజయవాడ జర్నీ టికెట్ రూ.99కే రాబోతోంది. 

 

తెలంగాణ ప్రభుత్వం ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్‌ బస్‌ ఇండియాని తీసుకొచ్చింది. ఇవి ఎలక్ట్రిక్ బస్సులు. గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. నెల రోజుల తర్వాత హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఈ ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామనీ, ఆ తర్వాత విజయవాడ-విశాఖ మధ్య కూడా సర్వీసులు ప్రారంభిస్తామని.. ఈటీవో మోటార్స్‌ సీఎంవో వైఎస్‌ఆర్‌ రాజీవ్, ఫ్లిక్స్‌ బస్‌ ఇండియా ఎండీ సూర్య ఖురానా తెలిపారు. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ బస్సుల సర్వీసులు ప్రారంభించాక.. మొదటి నెల రోజులు.. రూ.99కే.. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రయాణించేలా చెయ్యబోతున్నారు. ఆ తర్వాత ఖర్చులు, ఆదాయాలను లెక్కించుకొని.. టికెట్ రేటు ఎంత ఉండాలో నిర్ణయింస్తారు. ఇవి కొత్త బస్సులు కాబట్టి వేగంగా వెళ్తాయి. 5 గంటల్లోనే బెజవాడ బస్టాండ్‌కి వెళ్తాయి. 

 

ఈ బస్సుల్లో కూడా ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. అంటే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ బస్సుల్లో కూడా ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజెన్లకు టికెట్ రేటులో తగ్గింపు ఈ బస్సుల్లో కూడా ఉంటుంది. ఇవి పెద్ద బస్సులు కాబట్టి.. ఒక్కో బస్సులో 49 మంది ప్రయాణించవచ్చు. ప్రస్తుతానికి ఈ బస్సుల్లో కూర్చునేందుకు సీటింగ్ ఉంది. భవిష్యత్తులో స్లీపర్‌ కోచ్‌ బస్సుల్ని కూడా తేవాలనుకుంటున్నారు. 

 

ఎలక్ట్రిక్ వాహనాల్ని ఎంకరేజ్ చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆల్రెడీ టూవీలర్లు, త్రీవీలర్లకు రోడ్ టాక్స్ ఫ్రీ బెనెఫిట్స్ కల్పిస్తోంది. దాదాపు 2 సంవత్సరాలపాటూ.. ఈ ప్రయోజనాలు దక్కుతున్నాయి. ఇందులో మరో అడుగు ముందుకు వేసి.. ఎలక్ట్రిక్ బస్సుల్ని తెస్తోంది. ఈ బస్సులు బ్యాటరీతో నడుస్తాయి కాబట్టి.. వీటికి పెట్రోల్ భారం ఉండదు. అందుకే టికెట్ ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఫ్లిక్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు రెండు రాష్ట్రాల ప్రజలూ ఆసక్తిగా ఉన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!

 

విలన్ గా మారుతున్న బ్రహ్మానందం.. థియేటర్ అంతా షేక్ అవుద్ది అంటూ.. వ్యాఖ్య‌లు వైర‌ల్‌!

 

జగన్ దొంగ రాజకీయం.. ఆ డబ్బును లెక్కపెట్టడానికి.. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది!

 

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు! ఎక్కడో తెలుసా?

 

జగన్ 2.0 కాదు, పాయింట్ 5 మాత్రమే! మాజీ మంత్రి తీవ్ర విమర్శలు! ఇలాంటి పరిస్థితుల్లో..

 

ఈ ప్రాంత వాసులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్! కొత్త రైల్వే జోన్‌కు ఉత్తర్వులు జారీ.. ప్రధాన రైల్వే డివిజన్లు ఇవే.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Travel #Hyderabad #FlixBus #BusJourney